ఏపీలో భారీ వర్షాలు!
AP: తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా ' తుఫాన్ ఏ క్షణమైనా తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకావం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.