హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
HYD: కోకాపేట్లో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏడు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ ప్రభాకర్(27) గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. కోకాపేట్లో హాస్టల్ గదికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పని ఒత్తిడే ఆత్మహత్యకు కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.