ఏపీలో రెండు రోజుల పాటు కురువనున్న మోస్తరు వర్షాలు
ఏపీలో నేటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజ, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది.