Top 10 viral news 🔥
విద్యుత్ వైరు నీటిలో పడి భారీ మంటలు (వీడియో)
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా రోడ్లపై నీరు నిలిచిపోతాయి. వీటి వల్ల ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఒక్కోసారి ఊహించని భయంకర పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. వర్షం కారణంగా ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయింది. అదే సమయంలో కరెంట్ స్తంభం నుంచి వైర్ తెగిపోయి ఆ నీటిలో పడింది. దీంతో మంటలు చెలరేగాయి. టపాసులు పేల్చినట్టు ఆ నీటి నుంచి మంటలు ఎగిసిపడ్డాయి.