మధిర
చింతకాని: విద్యుత్ మోటార్ల చోరీపై కేసు నమోదు
వ్యవసాయ విద్యుత్ మోటార్లను దొంగిలించిన ఘటనపై చింతకాని పోలిస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రాఘవాపురం గ్రామంలో గత ఆగస్ట్ నెలలో వడ్డె పుల్లయ్య పొలంలో ఉన్న మోటార్‌తో పాటు చుట్టుపక్కల రైతులకు చెందిన మరో రెండు మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై నాగుల్ మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.