ఆడవారిలోనే 'లో-బీపీ' సమస్య అధికం: డాక్టర్లు
ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆడవారిలోనే లో-బీపీ సమస్య అధికంగా కనిపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. "ఈ సమస్యతో బాధపడేవారు రోజంతా చాలా బలహీనంగా ఉంటారు. ఉదయం పూట ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడప్పుడూ తల తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల రోజువారీ పనులు కూడా చేసుకోలేరు." డాక్టర్లు తెలియజేశారు.