హైడ్రా పేరుతో ప్రజలను సీఎం ఇబ్బందులు పెడుతున్నారు: కేటీఆర్ (వీడియో)
TG: ఢిల్లీకి మూటలు మోసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మాజీమంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని నాగోల్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో డబ్బులు పెట్టడానికి తెలంగాణ నుంచి మూటలు మోసుకొని పోయి రేవంత్ రెడ్డి సీఎం పదవి కాపాడుకుంటున్నాడు. దాని కోసమే హైడ్రా పేరుతో భయాందోళనలు చేస్తున్నాడు. మూసీ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి, డబ్బులు దండుకొని ఢిల్లీలో ఇస్తున్నాడు' అని అన్నారు.