నవ్వితే చాలు పేమెంట్ కంప్లీట్
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఫెడరల్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. సరికొత్త పేమెంట్ మేథడ్.. స్మైల్ పేను లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పిన్, మొబైల్ అవసరం లేకుండా కేవలం ఫేషియల్ రికగ్నిషన్‌తో లావాదేవీలు చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. ఒక్క స్మైల్ ఇస్తే చాలు పేమెంట్ జరిగిపోతుంది. ఇలాంటి సరికొత్త సేవల్ని దేశంలో ప్రవేశపెట్టిన తొలి బ్యాంకుగా ఫెడరల్ బ్యాంక్ నిలిచింది. అయితే ఇది ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.