భౌతిక శాస్త్రవేత్త రోహిణి గాడ్బోలే కన్నుమూత
పద్మశ్రీ గ్రహీత, కణ భౌతిక శాస్త్రవేత్త రోహిణి గాడ్బోలే పూణెలో శుక్రవారం కన్నుమూశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒక సంతాప నోట్లో ఇలా పేర్కొంది. ఆమె సైన్స్‌లో మహిళల ఛాంపియన్. ప్రొఫెసర్ గాడ్బోలే 1995లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్‌లో చేరారు. 2018లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఆమె పద్మశ్రీ, ఫ్రాన్స్ నుండి ఆర్డర్ నేషనల్ డు మెరైట్తో సహా అనేక ప్రశంసలు, అవార్డులను సాధించారు.