విజయనగరం
కూటమి అభ్యర్థులను గెలిపించండి
కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు కి మద్దతుగా ఆమె సోదరి విద్యావతి దేవి గజపతి రాజు , టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం చేశారు. విజయనగరం పట్టణం 48వ డివిజన్ లో గాజులరేగ బూడి వీధి, దిగువ వీధి, రాజ వీధి, శాలివీధి, చాకలి వీధి, పడాల వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.