హర్యానాలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు (వీడియో)
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్, ఒలింపిక్స్ పతక విజేత, షూటర్ మను బాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.