ఆంధ్రప్రదేశ్
Top 10 viral news 🔥
SHOCKING: ఐఐటీలలో విద్యార్థులకు నో జాబ్స్!
May 26, 2024, 04:05 IST/

SHOCKING: ఐఐటీలలో విద్యార్థులకు నో జాబ్స్!

May 26, 2024, 04:05 IST
ఐఐటీలలో చదివితే లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయనేది పాత మాట. ప్రస్తుతం ఐఐటీలలో చదివే వారికి జాబ్స్ దొరకడం లేదు. ఇది నిజం. ఐఐటీ కాన్పూర్ ఓల్డ్ స్టూడెంట్ ధీరజ్ సింగ్‌ RTI ద్వారా సమాచారం కోరగా ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. దేశంలోని మొత్తం 23 ఐఐటీలలో 2023-24లో 7,000లకు పైగా విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్స్ రాలేదు. రెండేళ్ల క్రితం 3,400ల మంది జాబ్స్ పొందలేకపోయారు. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు అయింది. ప్రతి ఐఐటీ క్యాంపస్‌లో 30 శాతం ప్లేస్‌మెంట్స్ తగ్గడం ఆందోళనకరంగా మారింది. ఇదే కాకుండా ప్రతిష్టాత్మక బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)లో చదువుకున్న వారికి సైతం జాబ్స్ దొరకకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.