హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్ లో పలు చోట్ల శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రామంతాపూర్, ఉప్పల్, మేడిపల్లి, నాగోలు, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దఅంబర్‌పేట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.