ఆలయంలో ఏసీ నుంచి కారుతున్న నీరు.. తాగేందుకు ఎగబడుతున్న భక్తులు(వీడియో)
ఓ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని తాగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆ నీరు శ్రీకృష్ణుడి పాదాల నుండి వస్తున్న పవిత్ర జలం అనుకోని టీ కప్పులకొద్ది తాగేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యూపీలోని బృందావన్లో ఉన్న ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఆ నీరు ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీల నుండి వస్తోందని, ఆ నీరు తాగితే ప్రమాదం అని వీడియో తీసిన వారు భక్తులకు చెప్పారు.