హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి సమగ్రమైన నివేదిక తయారు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకు వచ్చే నెల 1వ తేదీ వరకు టెండర్ల ప్రక్రియకు కార్యాచరణను రూపొందించాలన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపు ప్రణాళికలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ విషయంలో మిషన్ భగీరథ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పారు.