మంథని
రామగిరి ఖిల్లా అభివృద్ధికి సీఎం చొరవ చూపాలి
రామగిరి ఖిల్లా అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం సభలో రామగిరి ఖిల్లా అభివృద్ధిపై ప్రకటన చేయాలన్నారు. ఆలయాలు, పర్యాటక అభివృద్ధికి రూ. 200కోట్లను రాష్ట్రానికి కేంద్ర సర్కారు కేటాయించిందన్నారు. ఖిలా అభివృద్ది చెందితే జిల్లాకు గొప్ప పేరు వస్తుందన్నారు.