పటాన్చెరు నియోజకవర్గం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వైద్య అధికారి గాయత్రీ దేవి ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు.