సూర్యాపేట నియోజకవర్గం
కిందకి వేలాడుతున్న విద్యుత్ హై టెన్షన్ వైర్లు
తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. విద్యుత్ హై టెన్షన్ వేర్లు చేతికి అందే విధంగా కిందకి వేలాడాయి. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన తుంగతుర్తి ఏఈ స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి తక్షణమే విద్యుత్ తీగలను షిఫ్టింగ్ చేయవలసిందిగా కోరుతున్నారు.