రైతు భరోసాపై కీలక అప్డేట్!
రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ రుణమాఫీ చేశాక రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో చేసిన రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? 18 వేల కోట్ల రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే రైతుల నుండి మాకు నిరసన సెగ తాకేది కదా? మేం నిత్యం రైతులతోనే తిరుగుతున్నాం కాబట్టి మాపై నిరసనలు చేయడంలేదని మంత్రి తెలిపారు.