నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లు ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో నేడు సెలవు ఉండనుంది. ఈ మేరకు కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.