Top 10 viral news 🔥
రాజధానికి భూములు.. రంగంలోకి దిగిన నారాయణ
విజయవాడలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గురువారం పర్యటించారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆయన.. రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్తున్నారు. విజయవాడలోని రాజధాని రైతు అనుమోల్ గాంధీ నివాసానికి మంత్రి వెళ్లారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పలువురు రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పూలింగ్ అంగీకార పత్రాలను స్వీకరించారు. ఇప్పటి వరకు భూములు ఇవ్వని రైతుల ఇళ్లకు వెళ్లిన మంత్రి.. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి వివరాలను వెల్లడిస్తున్నారు.