ఉదయగిరి
వింజమూరు: ప్రభుత్వం తీరుపై సిపిఎం నాయకులు అసహనం
వింజమూరు తహాసిల్దార్ కార్యాలయం ఆవరణలో సిపిఎం నాయకులు ప్రజా సమస్యలపై గురువారం ప్రజా పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసిల్దార్ కు ప్రజా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సిపిఎం మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలపై పెను భారాలు మోపుతుందన్నారు. అడ్డు అదుపు లేకుండా ధరలు పెంచడంతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయన్నారు.