7.62 లక్షల కిలోల మాదకద్రవ్యాల ధ్వంసం: కేంద్రం వెల్లడి
పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది. గతేడాది దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోలకు పైగా మాదకద్రవ్యాలను డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ధ్వంసం చేశాయని కేంద్ర మంత్రి నిత్యా నందరాయ్ పేర్కొన్నారు. 'దేశవ్యాప్తంగా 2023లో 7.62 లక్షల కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేశాం. 2019తో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ' అని అన్నారు. 2023లో 7.62లక్షల కేజీలను స్వాధీనం చేసుకున్నారు.