ఇచ్చాపురం
కవిటి: రోడ్డున పడ్డ కుటుంబం.. అండగా ఎస్జీఎఫ్..!
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం నెలవంకకు చెందిన అలిగి కమల ఇటీవల మృతి చెందింది. ఆమెకు మతిస్థిమితం సరిగా లేని భర్త, నాలుగేళ్ల చిన్నారి ఉంది. కుటుంబ పెద్దదిక్కుగా ఉన్న మహిళ మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ గాయ్స్ ఫౌండేషన్ సభ్యులు గురువారం బాధిత కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థికసాయం అందించారు. భవిష్యత్తులో చిన్నారి చదువులకు అండగా ఉంటామని ఎస్జీఎఫ్ సభ్యులు తెలిపారు.