మద్యం షాపులు దక్కించుకున్నవారికి భారీ ఊరట
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు దక్కించుకున్న వారికి ప్రభుత్వం ఊరట ఇచ్చింది. మద్యం షాపులుకు జారీ చేసిన ప్రొవిజినల్ లైసెన్స్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 22 వరకు లైసెన్స్ ఉండగా.. ఆ గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు లైసెన్స్‌లకు సంబంధించి ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.