ఖమ్మం
నిపుణుల బృందానికి వరద నష్టం వివరాలను తెలిపిన ఖమ్మం కలెక్టర్
ఖమ్మం జిల్లాకు మంగళవారం విచ్చేసిన అంచనా నిపుణుల బృందానికి ఇటీవలి వరద నష్ట తీరు, చేపట్టిన చర్యల వివరాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. 229 గ్రామాలలో, 42 పట్టణ ప్రాంతాల్లో 53,430 మంది జనాభా ప్రభావితమయ్యారని, 59 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 9516 మందిని శిబిరాలకు తరలించడం జరిగిందని తెలిపారు. 6 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ. 30 లక్షలు ఎక్స్గ్రేషియా అందించామన్నారు.