జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం (వీడియో)
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఆర్టికల్ 370 రద్దుపై సభలో చర్చ జరిగింది. ఇది కాస్త బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణకు దారితీసింది. బీజేపీ, ఎన్సీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో సభ్యులు పేపర్లను చించి స్పీకర్‌పై విసిరేశారు. బీజేపీ, ఎన్సీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.