విజయనగరం
విజయనగరం: ది లెప్రసి మిషన్ సేవలు అభినందనీయం: కలెక్టర్
లెప్రసి మిషన్ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కొనియాడారు. ఒక వెనుకబడిన ప్రాంతంలో 105 ఏళ్ల క్రితమే సంస్థను స్థాపించి ఎన్నో విశేషమైన సేవలను అందించారని పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చెల్లూరు వద్దనున్న ది లెప్రసి మిషన్ ట్రస్ట్ ఇండియా 150వ వసంత వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉన్నతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు.