లాయర్‌ను నరికి చంపారు.. షాకింగ్ వీడియో
తమిళనాడులో పట్టపగలే ఘోర సంఘటన జరిగింది. కృష్ణగిరి జిల్లా హోసూరు కోర్టు సమీపంలో న్యాయవాది కన్నన్ను పట్టపగలే నరికి చంపారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోలీపులు అదుపులోకి తీసుకున్నారు. హంతకుడిని కోర్టులో హాజరుపరిచారు. అతడి హత్య వెనుక గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన వీడియో ఫుటేజీ సంచలనం సృష్టించింది.