విమానంలో సిగరెట్ తాగిన ప్రయాణికుడి అరెస్టు
టేకాఫ్ కావడానికి సిద్ధమవుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగాడు. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ అనే వ్యక్తి ఆదివారం శంషాబాద్ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీస్‌లో అబుదాబికి వెళ్తున్నాడు. విమానం టేకాఫ్ కావడానికి సిద్ధమవుతున్న సమయంలో అహ్మద్ రహస్యంగా సిగరెట్ తాగాడు. గమనించిన ఎయిర్‌హోస్టెస్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో అహ్మద్‌ను అరెస్ట్ చేసిన RGIA పోలీసులు కేసు నమోదు చేశారు.