నంబియార్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
AP: భారతీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ గ్రూప్ ఫౌండర్ టీపీ గోపాలన్ నంబియార్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ‘‘TPG నంబియార్‌ను కోల్పోయినందుకు చాలా విచారంగా ఉంది. తన దూరదృష్టితో కూడిన నాయకత్వంతో ఆయన BPLను ఓ బ్రాండ్‌గా మార్చారు. భారతీయ గృహాలకు నాణ్యమైన సాంకేతికతను తీసుకువచ్చారు. మన దేశ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి’’ అని పేర్కొన్నారు.