బెంగళూరులో దారుణం.. మహిళను 30కిపైగా ముక్కలుగా నరికి ప్రిడ్జ్లో దాచారు
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. ఆమె మృతదేహం ఛిద్రమైన స్థితిలో లభ్యమైనట్లు పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి. 30కి పైగా ముక్కలుగా నరికిన ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్లో కుక్కారు. అయితే ఈ హత్య దాదాపు 15 రోజుల క్రితం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.