నర్సీపట్నం
నర్సీపట్నం: సబ్ జైలును సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
నర్సీపట్నం సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి ఫియాజ్ ఖాన్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖైదీలు ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకోలేని స్థితిలో ఉంటే వెంటనే సంప్రదించాలన్నారు. మండల లీగల్ సర్వీసెస్ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖైదీలలో మార్పు రావాలన్నారు.