మహిళలపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
TG: పెద్దపల్లిలోని రంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన కుక్క పద్మను స్థానికులు.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పెద్దపల్లి పట్టణం ఉదయ నగర్‌కు చెందిన కుక్క అమృత, కుక్క భాగ్యగా పోలీసులు గుర్తించారు.