రెండో రోజు అటుకుల బతుకమ్మ విశిష్టత
బతుకమ్మ రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా అటుకుల బతుకమ్మగా జరుపుకుంటారు. బతుకమ్మకు ఈ రోజున ప్రధానంగా అటుకులతో నైవేద్యం ఇవ్వటం వల్ల ఈ పేరు వచ్చింది. రెండో రోజు కావటంతో రెండు వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. ఇందుకోసం తంగేడు, గునుగు పూలు తప్పకుండా ఉపయోగిస్తారు. సాయంత్రం బతుకమ్మ ఆడిన తర్వాత అటుకులు, బెల్లాన్ని అందరికి పంచుతారు.