రాత్రిపూట పెరుగు తింటే ఏమౌతుందో తెలుసా?
చాలామంది భోజనం చివరన పెరుగు లేకుండా ముగించరు. మధ్యాహ్నంతో పాటు రాత్రి కూడా పెరుగు తినే వారుంటారు. అయితే రాత్రి తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పెరుగులో ఉండే టైరమైన్.. మెదడును ఉత్తేజ పరుస్తుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, దగ్గు, జలుబు సమస్యలు వస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ పెరుగు తినడం మంచిది కాదు.