బద్వేల్
పోరుమామిళ్ల: గొడవపడినవారిపై కేసు నమోదు
పోరుమామిళ్ల మండలంలోని రామేశ్వరం గ్రామంలో నివాసం ఉంటున్న గౌర సుబ్రహ్మణ్యం, అతని భార్యపై కొందరు దాడి చేశారు. గౌర శ్రీనివాసులు, మరో ముగ్గురు వ్యక్తులు పొలం బోరు విషయంలో గొడవ పడి కట్టెలు, ఇనుప దంతెలతో కొట్టినట్లు బాధితులు తెలిపారు. ఇరువురికి రక్త గాయాలు కావడంతో పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని బుధవారం ఎస్సై కొండారెడ్డి తెలిపారు.