పాలకొండ
పాలకొండ.. ఘనంగా నందన్న తిరువీధి ఉత్సవం
పాలకొండ నగర పంచాయతీ పరిధిలో దేవాంగ వీధిలో గౌరీదేవి నందన్న ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఏడు రోజులు పూజలు అందు కొన్న శివుడు, పార్వతి, గౌరీదేవి ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. దేవరపేట నుంచి కోమట వీధుల్లో ఊరేగించి లుంబుర్ రోడ్ లో గల కిష్టాచెరువులో నిమజ్జనం చేసారు. దశాబ్దాల కాలంగా దేవాంగుల ఆచార సాంప్రదాయాలను ఆనాటి నుంచి ఈనాటి వరకు కుల ఆచారాలను కొనసాగిస్తున్న పెద్దలను అభినందించారు