Top 10 viral news 🔥
అక్టోబర్ 22 నుంచి ఆధార్ క్యాంపులు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 22 నుంచి ఏపీ ప్రభుత్వం ఆధార్ ప్రత్యేక క్యాంపులు చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లలో నాలుగు రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్, డెమోగ్రాఫిక్ అప్డేట్, ఈ-ఆధార్ వంటి సేవలందించనున్నారు.