జగిత్యాల
జగిత్యాల: కొనుగోలు కేంద్రాలు ఆకస్మిక తనిఖీ
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో మౌళిక సదుపాయాలు, ధాన్యం వివరాలు, తేమ శాతం తదితర అంశాలను పరిశీలించారు. వారి వెంట అర్బన్ మండల తహశీల్దార్ రాం మోహన్, ఎపియం వి. గంగాధర్, సిసి విద్యాసాగర్, విఓ అధ్యక్షురాలు లక్ష్మి, పలువురు రైతులు, కమిటీ సభ్యులు ఉన్నారు.