తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తిరుమల లడ్డూ వివాదంపై పలువురు దాఖలు చేసిన పిటిషన్‌ని జస్టిస్ గవాహి, జస్టిస్ విశ్వనాథ్‌లు విచారించారు. లడ్డు వివాదంపై దర్యాప్తునకు సంబంధించి కేంద్రం వైఖరి చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను విజ్ఞప్తి చేశారు. దీంతో తమ అభిప్రాయం తెలిపేందుకు సోలిసిటర్ జనరల్ సమయం కోరారు. ఆయన అభ్యర్థన మేరకు ఇవాళ ఉదయం 10.30 గంటలకు వాదనలను వింటామని ధర్మాసనం తెలిపింది.