Top 10 viral news 🔥
ప్రేమమ్ హీరోకి భారీ ఊరట
మలయాళీ ప్రముఖ హీరో నివిన్ పౌలీకి భారీ ఊరట లభించింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న అతడికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అతడితోపాటు మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. జస్టస్ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి చిత్రహింసలకు గురిచేశారంటూ యువతి చేసిన ఫిర్యాదుతో ప్రేమమ్ హీరో నివిన్ పౌలీపై కేసు నమోదు చేశారు. బుధవారం కొత్తమంగళం మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుపై విచారణ జరగ్గా ఇందులో నివిన్ పౌలీకి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.