పాలకొండ
ఉత్సవాలకు వేళాయే..
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ నెల 19న అమ్మవారు తెరచాటుకు వెళ్లనున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు చేయనున్నారు. ఏడాదికి ఒక్కసారి అంటే తెరచాటుకు వెళ్లే రోజు మాత్రమే అమ్మవారు అసలైన విగ్రహానికి అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అక్టోబరు 3వ తేదీ నుంచి 12వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.