200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది: రంగనాథ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందని తెలిపారు. శనివారం HYDలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..'హైడ్రా చర్యల వల్ల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను హైడ్రా కాపాడింది. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్లు నిర్ణయిస్తున్నాం' అని తెలిపారు.