
నల్గొండ నియోజకవర్గం
నల్గొండ: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
నల్గొండ పట్టణంలోని ఓ ప్రైవేటు కార్యక్రమనికి శుక్రవారం సాయంత్రం నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం వెళ్లి వస్త్తుండగా నల్గొండ నకిరేకల్ మార్గమధ్యంలో తాటికల్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో ఉన్నారు. అదే దారిలో వెళ్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వారికి మొరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.