Top 10 viral news 🔥
20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న వేములవాడకు సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వేములవాడ సభలో పాల్గొంటారు. అనంతరం గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పంపిణీ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 మంది గల్ఫ్ మృతుల కుటుంబీకులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లింపు కోసం రూ.85 లక్షలు కేటాయించారు.