తిరువూరు
తిరువూరు: వైభవంగా అయ్యప్పలు నగర సంకీర్తన
తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి దీక్షాపరులు నగర సంకీర్తన వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప మందిరం నుంచి పెద్ద ప్రమిదలో దీపాలు వెలిగించి పట్టుకొని అయ్యప్పల కీర్తనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామ ప్రధాన వీధుల్లో నగర సంకీర్తన చేశారు. ముందుగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప గురు స్వాములు పాల్గొన్నారు.