సాలూరు
నదిలో పడి వృద్ధురాలు మృతి
మక్కువ మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన శంబంగి గౌరమ్మ(65) నదిలో పడి మృతి చెందింది. శుక్రవారం గోముఖి నది దాటి పంట పోలాలకు వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. అప్పటి నుంచి ఆమెను వెతికే క్రమంలో శనివారం సాయంత్రం దేవరశిర్లాం సమీపంలో సువర్ణముఖి నది ఒడ్డున పంప్ హౌస్ వద్ద మృతదేహం లభించింది.