సత్యవేడు ఎమ్మెల్యే కేసులో బిగ్ ట్విస్ట్.. కేసును వాపస్ తీసుకున్న బాధితురాలు
AP: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. తనపై వేసిన లైంగిక ఆరోపణల కేసును క్వాష్ చేయాలని శుక్రవారం.. టీడీపీ ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇరు పక్షాలు కాంప్రమైజ్ కావడంతో పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఎమ్మెల్యే ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు వేసిన టీడీపీ మహిళా కార్యకర్త తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది.