భీమిలి
భీమిలిలో అలల తాకిడికి గురైన స్వాములు
విశాఖ సిటీ నుంచి భీమిలి పిక్నిక్ కు వచ్చిన ఇద్దరు స్వాములు సముద్ర అలల తాకిడికి గురయ్యారు. ఆదివారం కావటంతో అయ్యప్ప భక్తులు భీమిలి సముద్రానికి పిక్నిక్ కు వచ్చారు. అందులో కొందరు సముద్ర స్నానానికి సముద్రంలోకి వెళ్లగా ఇద్దరు తాకిడికి గురయ్యారు. ఫోటోగ్రాఫర్లు నూకరాజు, సతీశ్ ఇద్దరు గుర్తించి వారిని ఒడ్డుకు చేర్చారు.